ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలలో రూ:282 కోట్లతో ఉత్తర్వులు జారీ చేయడాన్ని తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం స్వాగతిస్తుంది. రజకవృత్తిదారుల సంఘం ఎన్నో సంవత్సరాల నుంచిఊ అనేక ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించి అన్ని జిల్లాలు మునిసిపాలిటీలు మండల కేంద్రాల్లో మెకానైజ్ లాండ్రీ (దోబీఘట్ల) నిర్మించాలని,తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించింది.ప్రత్యేకంగా ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించింది. ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా ఇచ్చింది.కావున ప్రభుత్వం ప్రకటనల వరకే పరిమితం కాకుండా త్వరత గతిగా నిధులు విడుదల చేసి, స్థలాలు కేటాయించి,అన్ని జిల్లాల్లో నిర్మాణాలు చేపట్టాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.