మండలం పరిధిలోని రేపాల గ్రామంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులు మహిళలు శుక్రవారం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా గ్రామంలోని గాంధీ విగ్రహం దగ్గర గ్యాస్ బండలతో నిరసన తెలిపి అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ పేద ప్రజలపై గ్యాస్ ధరలు పెంచిన బిజెపి ప్రభుత్వాన్ని కి రానున్న ఎన్నికలలో ఓటమి తప్పదని మహిళా మణులు ఏకమై బిజెపి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుండి గల్లి లోకి పంపించే వరకు మహిళా మణుల పోరాటం ఆగదన్నారు.అనంతరం గ్రామ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పల్లి రమణ వీరారెడ్డి,పల్లి రేణుక ఆదిరెడ్డి, బెజవాడ సీతారాములు,సారిక రామయ్య,బత్తుల నరసయ్య,గండు హనుమంతు,మొగిలిచర్ల రమేష్,పల్లి సైదిరెడ్డి,మొగిలిచర్ల వెంకటేశ్వర్లు,పాముల రాఘవేందర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.