సీపీఆర్ విధానం పై అందరూ అవగాహన కలిగి ఉండాలి.
Uncategorizedప్రమాదాల బారిన పడి శ్వాస ఆడకుండా, గుండె కొట్టుకోకుండా ఉన్న సమయంలో త్వరితగతిన స్పందించి క్షతగాత్రుడికి సిపిఆర్ చేయడం ద్వారా అతడి ప్రాణం కాపాడవచ్చునని కోదాడ డిఎస్పి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ విధానంపై డీజీపీ ఆదేశాల ప్రకారం రోడ్ సేఫ్టీ వింగ్ జీవీకే ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం మునగాల మండల కేంద్రంలో ని మోడల్ స్కూల్ నందు మునగాల, నడిగూడెం, మోతె, కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లకు చెందిన వాహన డ్రైవర్లకు,ప్రవేట్ వాహనాల డ్రైవర్ లకు, మునగాల యువతకు మరియు ఆటో డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినదని డిఎస్పీ తెలిపినారు. ఏ రకమైన ప్రమాదానికైనా గురై శ్వాస పీల్చుకో లేకుండా గుండె ఆగిపోయిన సందర్భంలో అప్పటికప్పుడు సిపిఆర్ చేయడం అనేది చాలా ముఖ్యమైన చర్య అని దీనిని పోలీస్ సిబ్బంది శ్రద్ధతో నేర్చుకుని నైపుణ్యంగా పనిచేయాలని అదేవిధంగా పౌరులు కూడా ఈ పద్ధతి ద్వారా ప్రమాదాలలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు. జీవీకే సంస్థ అత్యవసర విభాగం చెందిన డాక్టర్ మధుసూధన్ సి పి ఆర్ పై వివరింగా శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమం నందు తెలంగాణ పోలీసు రాష్ట్ర రోడ్డు సేఫ్టీ విభాగం డిఎస్పి చంద్రబాను, సిఐ మునగాల ఆంజనేయులు, సిఐ కోదాడ రూరల్ పి ఎన్ డి ప్రసాద్, ఎస్సై లోకేష్, ఎస్సై నాగభూషణం, ఎస్సై ఏడుకొండలు, ఎస్సై సాయిప్రశాంత్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.