ఈ రోజు ములుగు లిటిల్ ఫ్లవర్ పాటశాల లో వర్డ్ మహిళా మహా సభ సానుభూతి కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని సీతక్క గారు అన్నారుఅనంతరం అనాధ పిల్లలకు బట్టలు పంపిణీ చేసిన సీతక్క గారు ఈ సందర్భంగా సీతక్క గారు అనాధ పిల్లలకు 5వేల రూపాయలు అందించడం జరిగిందిఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ తదితరులు