నీటి కోసం అల్లాడుతున్న గ్రామస్తులు.
Uncategorizedఅనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో 3,4 వార్డులలో గ్రామపంచాయతీ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ వార్డు ప్రజలు ఆరోపించారు ఈ మేరకు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ… గత పది రోజుల నుండి నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని , చుట్టుపక్కల కూడా ఎక్కడ బోరింగ్ లేకపోవడంతో నీటి కోసం హారిగోసపడుతున్నారు. అసలు వేసవికాలం కావడంతో నీటి వాడకం ఎక్కువగా ఉండటం, పశువులకు నీళ్లు పెట్టడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టి నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని మాట్లాడుతూ.. డ్రైనేజీ నుండి దుర్వాసన వెదజల్లుతున్న పాలకులు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులకు చెప్పిన ఫలితం లేదని తక్షణమే డ్రైనేజీలో ఉన్నటువంటి బురదను పూడిక తీయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇదిలా ఉంటే గ్రామంలో నీటి కోసం వేసినటువంటి పైపులైన్లు అనేక ఏండ్లు కావడంతో, మిషన్ భగీరథ కు లింక్ చేసి నీటిని విడుదల చేసిన పైపులు ఎక్కడకక్కడ పగిలిపోతున్నాయి. అందుకే కొన్ని వార్డులలో నీరు వస్తున్న, మరికొన్ని వార్డులలో నీరు అందడం లేదని తెలుస్తుంది.