నిరుపేదలకు ఉచిత వస్త్రధాన కార్యక్రమం అభినందనీయం
Suryapetమునగాల మండల పరిధిలోని రేపాల స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం సందర్భంగా సోమవారం దేవాలయ ప్రాంగణంలో నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో ఉచిత వస్త్రధాన కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి కళ్యాణం రోజున మునగాలమండల పరిధిలోని రేపాల. సీతానగరం.విజయ రాఘవపురం.గ్రామాలకు చెందిన 200 మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకువస్త్ర పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఖానాపురం సర్పంచి జొన్నలగడ్డ శ్రీనివాసరావు. కోదండరామాపురం సర్పంచి దేవరకొండ రమేష్. ప్రముఖ రంగస్థలం కళాకారులు డాక్టర్ గుంటి పిచ్చయ్యలను అభినందించారు.ఈ కార్యక్రమంలో రేపాల గ్రామ సర్పంచ్ పల్లి రమణ వీరారెడ్డి. జడ్పిటిసి నల్లపాటి ప్రమీల శ్రీనివాస్. ఎంపీపీ యలకబిందు నరేందర్ రెడ్డి. మునగాల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్. బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తోగరు రమేష్. వెంకటరెడ్డి. రేపాల బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లి ఆదిరెడ్డి. ఎంపీటీసీ సోమపంగు మోహన్. సారిక పెద్దరామయ్య. పందిరి పుల్లారెడ్డి. గండు హనుమంతు.బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు రావులపెంట కిరణ్. ( కిట్టు) లింగరాజు.గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు