మునగాల మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో సోమవారం సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మునగాల శాఖా గ్రంధాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నల్లపాటి నాగరాజు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మంత్రిగారి అండదండలతో జిల్లా గ్రంధాలయ సంస్థను ప్రగతి పథంలో నడిపించుటలో ఎంతగానో కృషి చేస్తున్నారు అని శాఖ గ్రంధాలయాలకు పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రతి గ్రంథాలయంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉద్యోగ భర్తీలో భాగంగా గ్రంథాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు కావలసినటువంటి స్టడీ మెటీరియల్ ఫర్నిచర్ సకాలంలో పంపించడం జరుగుతుందని శిథిలావస్థలో ఉన్న భవనాలను నూతన భవనాలుగా తీర్చిదిద్దుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గ్రంథాలయ అధికారి దేవత లలితాదేవి, శ్రీను, లీడర్స్ ఫోరం, అధ్యక్షుడు అంజయ్య గౌడ్, కమిటీ సభ్యులు ,రీడర్స్ గోపాల్ రెడ్డి పవన్, రవి, మల్లికార్జున్, మోహన్, సతీష్, రమేష్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.