స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ డేటా స్ట్రక్చర్స్ అని అంశంపై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ జక్కేపల్లి పవన్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్, నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచా పల్లి గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల డేటా స్ట్రక్చర్స్ ఎలా దోహదపడతాయో క్లుప్తంగా వివరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డాక్టర్ పవన్ మన కళాశాలలో విద్యను అభ్యసించి దేశంలోనే ప్రతిష్టాపమైన విశ్వవిద్యాయంలో అధ్యాపకుడిగా ఉండడం గర్వించదగ్గ విషయమని అనేక మంది విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో సుమారు 210 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, సిఎస్సి విభాగఅధిపతి శ్రీనివాసరావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ విద్యాసాగర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు