మానుకోట జిల్లా మరిపెడ మండలంలోని ఉల్లేపెళ్లి గ్రామ శివారు భూక్యాతండ గ్రామ పంచాయతీ పరిధిలో గల మహిమాన్వితమైన సుప్రసిద్ధ స్వయంభు మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవం భక్తజన సందోహంలో రాముడు అచ్యుతరావు-సునీత ల ఆధ్వర్యంలో కన్నులపండుగగా జరిపారు.ఈ సందర్భంగా రామడుగు అచ్యుతరావు మాట్లాడుతూ ప్రతి సంవంత్సరం స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటున్నామని,భక్తితో స్వామివారిని కొలిస్తే కోరిన కొరికెలు తీర్చే మహిమగల మల్లిఖార్జున స్వామి అని అన్నారు.మల్లిఖార్జున స్వామి అనుగ్రహముతో మంచిగా పంటలు పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో పాడి పంటలు పండేలా ఆ మల్లిఖార్జున స్వామి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణం చేస్తున్నామన్నారు.ఈ మహిమాన్విత మల్లిఖార్జునస్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించేటందుకు రెండు తెలుగు రాష్టాలనుండి భక్తులు వందలో సంఖ్యలో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో ఉల్లేపెళ్లి సర్పంచి చిర్నబోయిన ప్రభాకర్,భూక్యా సర్పంచి భూక్యా సెవ్యా,ఎంపిటిసి జ్యోతి రామ్మూర్తినాయక్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.