మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆయా రంగాలలో రాణిస్తున్న మహిళ మనులందరికి శాలువా కప్పి సన్మానించి వారికి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సేవ చేస్తూ సమాజానికి గుర్తింపు తెస్తున్నారన్నారు.మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిఒక్కరూ చదువుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు అరుణా రాంబాబు,మునిసిపల్ చైర్మన్ సింధూర రవి,మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి,డాక్టర్ రవి, కాలు నాయక్,వుప్పల నాగేశ్వేర్ రావు కౌన్సిలర్లు మరియు ఆయా శాఖల మహిళ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.