బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద విధానాలను ఎండగట్టే జనచైతన్య యాత్రల పోస్టర్ ఆవిష్కరణ2023 మార్చి 27న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
Uncategorizedసీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2023 మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాపితంగా 33 జిల్లాలను కవర్ చేస్తూ మూడు బృందాలు ”జనచైతన్య యాత్ర” పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నదని ఈ యాత్ర సందర్బంగా జనగామ చౌరస్తాలో 2023 మార్చ్ 27న నిర్వహించే బహిరంగ సభను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు.
దివి: 20-03-2023 సోమవారం రోజున పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మోకు కనకారెడ్డి మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను ఎండగట్టడానికి, రాష్ట్ర వ్యాపితంగా వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్న ఈ యాత్రకు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతివ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో దేశానికి, దేశ భవిష్యత్‌పై జరుగుతున్న దుర్మార్గాలను ఎండగట్టడానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్ర జరుగుగున్నదని పేర్కొన్నారు. బీజేపీ, దానివెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రమాదకరమైన సిద్ధాంతాలు, ప్రజల మధ్య పెడుతున్న మతచిచ్చు, ఈ దేశాన్ని మధ్యయుగాల నాటి పురాతన సంస్కృతికి తీసుకుపోవడానికి చేసే దాని ప్రయత్నాలను ప్రజల ముందుంచుతామని అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ యాత్రను పెద్దఎత్తున జరపాలని నిర్ణయించామని తెలిపారు. జిల్లాలో ప్రజాఉద్యమ అభిలాషులు, అభ్యుదయవాదులు, సామాజిక శక్తుల సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. వారందరూ ఈ యాత్రను బలపరుస్తున్న వాతావరణంతోపాటు, వారిమద్ధతు కూడా లభిస్తున్నదని అన్నారు. 2023 మార్చి 27న జనగామ చౌరస్తా వద్ద సాయంత్రం: 5-30 గంటలకు బహిరంగ సభ ఉంటుందని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి. అజారుద్దీన్, బి. చందునాయక్, ప్రజాసంఘాల నాయకులు గంగాపురం మహేందర్, బిట్ల గణేష్, దూసరి నాగరాజు, మంగ బీరయ్య, కళ్యాణం లింగం, అజ్మీరా సురేష్, గాడి శివ, బాలు, కళ్యాణం శ్రీకాంత్, పల్లపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.