హిందూ మతం ముసుగులో మనువాదం అమలు.
Jangaon25-03-2023
బీజేపీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం.
2023 మార్చి 27న బహిరంగ సభ
(సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్ పిలుపు.)
హిందూ మతం ముసుగులో మనువాదం అమలు చేయాలని, బీజేపీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడబోతుందని బిజెపిని గుట్టును ప్రజలకు తెలియజేయడంకోసం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2023 మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాపితంగా 33 జిల్లాలను కవర్ చేస్తూ మూడు బృందాలు ”జనచైతన్య యాత్ర” పేరుతో బస్సుయాత్ర జరుగుతుందని, ఈ యాత్ర సందర్బంగా జనగామ చౌరస్తాలో 2023 మార్చ్ 27న బహిరంగ సభను ఏర్పాటు చేయనైనది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపునిచ్చారు.
దివి: 25-03-2023 శనివారం రోజున పార్టీ జనగామలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో పేదలు మరింత పేదలుగా, సంపన్నులు ఇంకా సంపన్నులుగా మారుతున్నారన్నారు. దేశంలో పేదల ఆకలి చావులు, నిరుద్యోగం పెరిగిందన్నారు. మతోన్మాద బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను ఎండగట్టడానికి, రాష్ట్ర వ్యాపితంగా వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్న ఈ యాత్రకు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతివ్వాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో దేశానికి, దేశ భవిష్యత్‌పై జరుగుతున్న దుర్మార్గాలను ఎండగట్టడానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్ర జరుగుగున్నదని పేర్కొన్నారు. బీజేపీ, దానివెనుక ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రమాదకరమైన సిద్ధాంతాలు, ప్రజల మధ్య పెడుతున్న మతచిచ్చు, ఈ దేశాన్ని మధ్యయుగాల నాటి పురాతన సంస్కృతికి తీసుకుపోవడానికి చేసే దాని ప్రయత్నాలను ప్రజల ముందుంచుతామని అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ యాత్రను పెద్దఎత్తున జరపాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి..టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రు. 50వే పంటల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2023 మార్చి 27న జనగామ బస్టాండ్ చౌరస్తా వద్ద సాయంత్రం: 5-30 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ప్రజలందరు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు p.ఉపేందర్, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, bi.చందు నాయక్, బోడ నరేందర్, ఎ. కుమార్, బి వెంకటమల్లయ్య, ధర్మబిక్షం, దడిగె సందీప్, k.లింగం, p.లలిత, సిఎచ్ రజిత తదితరులు పాల్గొన్నారు.