వల్మీడికి భద్రాచలానికి మించిన వైభోగం
Jangaonఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి అవకాశాలు
పాలకుర్తి, బమ్మెర, వల్మీడి ల పై సీఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి
సొంతంగా మంత్రి రూ.5 లక్షల విరాళం
ఈ అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం
వల్మీడిలో శ్రీరామ నవమి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వెల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి భద్రాద్రి కి మించిన వైభోగం దక్కేలాగా అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భద్రాద్రి దేవాలయానికి ఉన్నంత ప్రాశస్త్యం చరిత్ర వాల్మీడీ దేవాలయానికి కూడా ఉందని ఆయన చెప్పారు. మిగతా దేవాలయాలకు భిన్నంగా వాల్మీకి దేవాలయానికి ఎకరాల కొద్ది స్థలం ఉందని ఆ స్థలాన్ని ఆసరా చేసుకుని దేవాలయాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసే అవకాశం మెండు గా ఉందని మంత్రి చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే సీతారామచంద్రస్వామిల కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి ఆదివారం సమీక్షించారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాముడు నడయాడిన నేలగా, రామాయణ కర్త వాల్మీకి మహర్షి తపస్సు చేసిన గుట్టగా, వల్మిడికి చరిత్ర ,గుర్తింపు, గౌరవం ఉన్నాయని మంత్రి తెలిపారు. గుట్టను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ దేవాలయంలో 11 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కళ్యాణ మండపం గుట్ట మీదకు రోడ్డు వంటి సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ సైతం పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ గ్రామాల ను కలుపుతూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచడానికి అడిగిన నిధులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేక చొరవ చూపుతూ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ మూడు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో వల్మీడి దేవాలయంలో ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీ సీతారామచంద్రస్వామిల కళ్యాణం ఘనంగా వైభోగంగా నిర్వహించనున్నట్లు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.