పదవతరగతి బాల బాలికలకు ప్యాడ్స్ పెన్నులు పంపిణి
Suryapetజాటోత్ డేవిడ్ రాజు
సూర్యాపేట చార్లేట్ హోం వ్యవస్థాపక అద్యక్షులు
గత 27 సంవత్సరాలుగా స్థానిక మునగాల మండల కేంద్రంలో అత్యంత ప్రామాణికమైన విద్యతో నడుప బడుతున్న ట్రినీటి హై స్కూల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల నందు పదవతరగతి పరీక్షలకు హజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులు 26 మంది పేద పిల్లలకు ప్యాడ్స్, పెన్నులు, స్కెల్స్, ఏరైజార్స్, పెన్సిల్స్,శాప్సనార్స్ లు చార్లెట్ హోం అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు అందించినారు. అనంతరం వారు మాట్లాడుతూ పరీక్షలు బాగా రాశి 10 కి 10 మార్కులు తీసుకురావాలని దానివలన విద్యార్దులకు మరియు ట్రినీటి హై స్కూల్ పాఠశాలకు, టీచర్స్ కు తల్లి తండ్రులకు మంచి పేరు ను తీసుకువచ్చిన వారౌతారని , భౌవిషత్ లో ఉన్నత స్థాయికి చేరాలంటే పదవతరగతి మార్కులు ఎంతో ఉపయోగపడతాయనీ అన్నారు. ఈ కార్యక్రమం లో బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్, ట్రినీటి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ శ్రీమతి ముల్లంగి జానకి వనజ మాట్లాడుతూ గతంలో ప్రయివేటు పాఠశాలలో 10 కి10 సాధించిన ఏకైక పాఠశాల గా గుర్తింపు ఉందని ఇప్పడూ అదే కొనసాగిస్థామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా ముల్లంగి జాకబ్ రాజు, పాస్టర్ సుందర్ రావు, ప్రవేట్ ఉపాధ్యాయ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరోజ్ సైదులు, మాడుగుల రాహుల్ తదితరులు పాల్గొన్నారు