ఈ రోజు భూపాలపల్లి మండలం, కమలాపూర్ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ నందు HDFC పరివర్తన్ వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు,జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా,అడిషనల్ కలెక్టర్ దివాకర్,వైస్ చైర్మన్ శ్రీమతి కల్లెపు శోభ గారు. పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. HDFC వారి సౌజన్యంతో పంబాపూర్, కమలపూర్ గ్రామ జాలరులకు రక్షణ కవచాలను మరియు చేపల పట్టే వలలను తదితర సామగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.