మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సీఎం కప్ క్రీడలను ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడలు నిర్వహిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు క్రీడాకారులకు పూర్వవైవం తెచ్చారన్నారు.ఈ అవకాశాన్ని యువ క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో,ఎంపీడీవో, ఎమ్మార్వో,ఎంపీఓ,స్కూల్ హెచ్ఎం,పిఈటిలు, క్రీడాకారులకు తదితరులు పాల్గొన్నారు.