జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో విద్యుదాఘాతంతో పాడి గేదె ఉదయం 6 గంటల 45 నిమిషాలకు మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. రేగొండ మండలలోని వెంకటేశ్వర్లు పల్లి గ్రామానికి చెందిన బోయినీ కుమారస్వామికి చెందిన పాడి గెదె సుమారు 60 వేల పైబడి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు, విద్యుత్ ప్రమాదం ద్వారా చనిపోయిన గేదె విలువను తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతుకు అందించాలని గ్రామ సర్పంచ్ చిగురుమామిడి రజిత- రాజు, గాజే శ్రీనివాస్ ఎం పి టి సి గండు కుమారస్వామి మరియు గ్రామస్తులు కోరారు.