టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో లేదు
Bhadradri Kothagudemతెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కరించడానికి సమయం దొరకడం లేదని ఎబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ అన్నారు హనుమకొండ పట్టణంలో ABVP ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్క రించడానికి సమయం దొరకడం లేదని అన్నారు.గత నాలుగు సంవత్సరాల నుండి అనేక రకాల విద్యారంగ సమస్యలు ఉన్నప్పటికీ విద్యను నిర్వీర్యం చేసే విధం గా విద్యారంగం ఉన్నది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెం ట్ స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతుంటే, గత నాలుగు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా విడుదల చేయని కారణంగా నిరుపేద విద్యార్థులకు విద్యా దూరమయ్యే పరిస్తితి ఉందని అన్నారు పెండిం గ్లో.. 5300 కోట్ల రూపాయల ఫీజు రీయింబ ర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు ఇప్పటికై నా ఈ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టి లో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి ఫీజు రీయింబర్స్మెంట్ కు చట్టబద్ధత కల్పించాలని అని డిమాండ్ చేశారు తెలంగాణ రా ష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఇప్పటికే సుమారుగా 8000 పాఠశాలలో మూసివేయడం జరి గిందని మండిపడ్డారు. ప్రస్తుతం 6300 పాఠశాలలు సింగిల్ టీచర్ తోని నడుస్తున్నాయని అన్నారు 15000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నా రుసుమారుగా 525 మండలాలు ఉంటే 18 మంది మా త్రమే MEO లు ఉంటే ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ ఏ విధంగా జరుగుతుందని అన్నారు. 300 గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థికి సంబంధించి ప్రభుత్వం ఎని మిది రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుందని అ న్నారు, ఒక్క విద్యార్థి కనీసం భోజనం చేయడానికి 60 రూపాయలు ఖర్చవుతున్న రోజుల్లో కేవలం ఎనిమిది రూపాయలతోని ఏ విధంగా భోజనం పెడతారు అని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి లో పాఠ్యపుస్తకాలు యూని ఫామ్స్ రాని కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యు కేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక భూమిక గ పోషించిన టు వంటి యూనివర్సిటీలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభు త్వం యూనివర్సిటీలో ఉన్నటువంటి 75% సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని, కాస్మటిక్ చార్జీలను పెంచాలని అన్నారు. మరియు సంక్షేమ హాస్టల్లో తరచూ ఫుట్ పాయిజన్ అవుతున్న కేసులు దృష్టిలో పెట్టుకొని ప్రతి హాస్టల్ కి మెడికల్ సిబ్బంది అలార్ట్ చేయాలని అన్నా రు. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు తీసుకున్న టు వంటి ప్రైవేట్ యూనివర్సిటీ లపై చర్యలు తీసుకో వాలనీ ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఖాళీ గా ఉన్నటువంటి 191000 నోటిఫికేషన్లను విడుదల చేసి ఎలక్షన్లకు ముందే రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది,లేని యెడల రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ యొక్క కార్యక్రమానికి హనుమకొం డ జిల్లా కన్వీనర్ అయిత నిఖిల్, వరంగల్ మహా నగర కార్యదర్శి ఆరేపల్లి సుజిత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరుణ్, నయీమ్ నగర్ జోనల్ ఇన్చార్జ్ మనోజ్ హనుమకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాకేత్, మరియు ఎబివిపి కార్యకర్తలు పాల్గొన్నారు.