మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు చెరువు చేపల సంపదను కాపాడాలని సొసైటీ మాజీ అధ్యక్షులు అనంత గురవయ్య సభ్యులను కోరారు. శుక్రవారం కలకోవ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమావేశనికిసొసైటీ మాజీ అధ్యక్షులు అనంతు గురువయ్య కలకోవ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ సంఘం పరిధిలోని ఊర చెరువులో 36 మంది సభ్యులు ఉండగా 34 మంది హాజరయ్యారని చెరువ్వు చేపల సంపదను కాపాడు కొనుటకు ప్రతి రోజు పది మంది వెళ్లి చేపల సంపదను కాపాడాలని సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో కోఆరేట్ నిబంధనల ప్రకారం తీర్మానాలు చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు పాతకోట్ల లింగయ్య, మండవ వెంకన్న, తుమ్మల వీరయ్య, సురభి వెంకటేశ్వర్లు, బంధు శ్రీను, మోగించారు పనస శివనాద్రి, బుర్రి బాబు, పబ్బు లింగయ్య, సాల చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.