తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కలిసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఈ రోజు హన్మకొండ, వరంగల్ జిల్లాల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీకార్యవర్గం హన్మకొండ, వికాస్ నగర్ లో గౌరవ శ్రీ ఏ. జగన్మోహన్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా టిజిఓ కో – ఆర్డినేటర్, గౌరవ శ్రీ కోలా రాజేష్ గౌడ్ టిజిఓ రాష్ట్ర కార్యదర్శి మరియు గౌరవ శ్రీ గోపు రఘుపతి రెడ్డి , యం పి ఓ రాష్ట్ర అసోసియేషన్ సహాయ ఆధ్యక్షులను స్వగృహంలో కలిసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టైం స్కేల్ తో పాటు క్రమబద్ధీకరణ చేసే విధంగా ప్రభుత్వ దృష్ష్టి కి తీసుకెళ్ళి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకి అండగా ఉండాలని ఉద్యోగులందరూ కలిసి వినతిపత్రాన్ని రాష్ట్ర జేఏసీ నాయకుడు దోయిపడి శ్రీధర్, జిల్లా జేఏసీకో – ఆర్డినర్ డా. కుసుమ సూర్య కిరణ్ మరియు జిల్లా జేఏసీ సభ్యులు పులి రాజేష్, సురేష్ , వాసు ఆరూరి, పి. శ్రీనివాస్, టీ .రాజేశ్వర్, మహేష్ వినయ్, మహమ్మద్ ఆసిఫ్, కుమార్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు