మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం అభినందనీయమని మండల ఎస్. ఐ. ఏడుకొండలు అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని బొడ్రాయి బజార్ లో స్టార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద స్థానిక వార్డు సభ్యులు మేకల గంగరాజు, గుండు శ్రీనివాస్ తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఎస్. ఐ. ఏడుకొండలు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అన్నదానం మహాదానమని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.గణేష్ నిమజ్జనం కుల,మతాలకు అతీతంగా నిర్వహించుకోవాలని,ఎలాంటి సాహోసపెతమైన కార్యక్రమాలు చేయకూడదని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో ఏ.ఎస్. ఐ. జగన్నాథం,పందిరి లక్ష్మీనరసింహారెడ్డి, కాసాని నాగేశ్వరరావు,మేకల వీరబాబు,కాసాని ఉపేందర్, చిమట శ్రీహరి,నక్క కేశవులు, మేకల శ్రీను, లింగరాజు, పోలీస్ సిబ్బంది, కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.