పార్టీ పటిష్టతకు కృషి చేయండి
Suryapetబిఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నడిగూడెం గ్రామ శాఖ నూతన కమిటీ అధ్యక్షులుగా బోనగిరి ఉపేందర్,ప్రధాన కార్యదర్శిగా కాసాని సతీష్, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నక్కా సైదులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా
బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త
కృషిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు పని చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బడేటి చంద్రయ్య బొల్లం శ్రీనివాస్, దున్న సుధాకర్,దాసరి శ్రీనివాస్, జలీల్ అహ్మద్ గుండు శ్రీనివాస్, మేరి ధనయ్య, మేకల గంగరాజు, దున్న వెంకటేశ్వర్లు, దున్న అర్జున్ , మొరిశెట్టి రమణారావు,వందనపు మోహన్ రావు,గజ్జి అప్పారావు, కొండా వెంకన్న, షేక్ జానీ మియా, కన్నెబోయిన మురళి, బడుగుల వెంకటేష్ శ్రీరాముల సైదులు, కలకొండ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.