మునగాల ఆశా వర్కర్ల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరావధిక సమ్మె పదవ రోజుకు చేరింది బుధవారం మండల కేంద్రంలో ఆశా వర్కర్ల చేపట్టిన నిరావధిక సమ్మెలో మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మా వతి రెడ్డి పాల్గొని నిరసన వ్యక్తం పరిచారు గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలు వెలగట్టలేని వని ఆమె అన్నారు పది రోజుల నుండి పి హెచ్ సి సెంటర్ లో నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లను నేటికి ప్రభుత్వం నుండి పరిష్కార మార్గ ఆదేశాలు జారీ చేయకపోవడం ఏమిటని ఆమె ప్రభుత్వం పై మండిపడ్డారురాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్కర్లకు ఖచ్చితమైన ఫిక్స్ వేతనాన్ని అమలుపరుస్తామని ఆమె అన్నారు ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే జైపాల్ రెడ్డి జిల్లా నాయకులు కాసర్ల కోటయ్య వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య మండల కాంగ్రెస్ నాయకులు జానకి రెడ్డి ఎంపీటీసీలు ఉప్పుల రజిత రెడ్డి కల్పన లక్ష్మి నరసయ్య వెంకట్ శ్రీనివాస్ గౌడ్ విజయ్ గౌడ్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.