రేగొండ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో,టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన వెలిశాల గ్రామం నుండి ఎస్సీ కాలనీ చందన బిఆర్ఎస్ కార్యకర్తలు యువత నేడు మన గండ్ర సత్తన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు బోయిని రాజయ్య, బోయిని రాజశేఖర్, తాటి పెళ్లి సమ్మయ్య పోతిగంటి వీరయ్య కోడూరి కిరణ్ కోడూరు సారయ్య బోయిని రాజు బోయిని రమేష్ రత్నం శంకర్ బోయిన్ సదయ్య కోడూరు సూర్యంవీరంతా నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినారు.తదనంతరం,వారంతా మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో సత్తన్న గెలుపు ఖాయమని వారి గెలుపుకై అహర్నిశలు పాటుపడతామని..తమ వంతుగా కృషి చేస్తామని వారు తెలిపారు.కార్యక్రమం అనంతరం సత్తన్న మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమైందని..రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెలిశాల గ్రామ సర్పంచ్ విజయ స్వామి రావు.. కోటగిరి సతీష్ గౌడ్.., వెలిశాల గ్రామ అధ్యక్షులు బండి లింగస్వామి మండల యూత్ నాయకులు వీరితో పాటుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు