కెవిపిఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి దహనం
Uncategorizedమనుషులమధ్య ద్వేషాన్ని నింపిన మనుస్మృతి రాజ్యాంగ రక్షణతోనే మనుస్మృతి భావాలను ప్రతిఘటించాలి కెవిపిఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి దహనం కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ రాజ్యాంగం రద్దుకు చేస్తున్న కుట్రలను తిప్పికొడుతూ మనుషుల మధ్య ద్వేషాన్ని నింపి అనైక్యతను సృష్టించిన మనుస్మృతిని భావాలను ప్రతిఘటించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు దగ్గర కెవిపిఎస్ ఆధ్వర్యంలో మనుస్మృతి దహన దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమానవీయ మనుస్మృతి గ్రంథాన్ని దహనం చేశారు అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు మను అధర్మ శాస్త్రమే మూలమన్నారు ఆశాస్త్రీయమైన అమానవీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలన్నారు , ఈ దేశం లో నూటికి 90శాతం మందికి చదువు సంపదలు దూరం చేసి కేవలం10శాతం మందికోసం మెజార్టీ ప్రజలను బానిసలుగా మార్చిందన్నారు. మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతరేయాలని పిలుపునిస్తూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని మహాద్ పట్టణం చౌదార్ చెరువు మంచినీళ్ల పోరాటం ప్రారంభిస్తూ రాయగడ్ జిల్లాలో వేలాది మందితో కలిసి దగ్ధం చేశారన్నారు అదే సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మనుధర్మ శాస్త్రానికి ప్రజలు నిప్పు పెడతారని చెప్పారు అసంబద్ధమైన,అనాగరికమైన ఆలోచనల ద్వారా వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనన్నారు భారతదేశంలో మెజార్టీ ప్రజలకు సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను దూరం చేయడానికి దుర్మార్గమైన కర్మ సిద్దాంతాన్ని నమ్మించడానికి ప్రపంచంలో మరెక్కడలేని విధంగా ఈ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు. దాని దుష్ఫలితాలు నేటికి అనేక అసమానతలకు మూలాలుగా కొనసాగుతున్నాయన్నారు సకల సంపదలను మెజార్టీ ప్రజలకు నిషేదించిన మనుస్మృతి భావాలను తుదముట్టించకపోతే ఈ దేశ ప్రజలు వేల ఏండ్లుగా అనుభవిస్తున్న అన్ని రకాల వివక్షతలు అసమానతలు దోపిడీ వంశపారంపర్యంగా కొనసాగి కొందరు కోటీశ్వర్లుగా,కోట్లాది మంది బికార్లుగా శాశ్వతంగా నిలబెడే ప్రమాదం ఉందన్నారు. మనుధర్మశాస్త్రం భారతీయ సమాజాన్ని గతంలోను,ఇప్పుడు విస్తృతంగా ప్రభావితం చేస్తుంధన్నారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడివ్యవస్థ రక్షణకై పుట్టిందే మనువాదం అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్న భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మనస్ఫూర్తిని ఈ దేశంలో తిరిగి ప్రవేశపెట్టడానికి బిజెపి ఆర్ఎస్ఎస్ లు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని మనస్ఫూర్తి భావజాలాన్ని మట్టిలో పాతదేసి రాజ్యాంగాన్ని ఎత్తిపట్టడానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాజ్యాంగ రక్షకులంతా ఏకమై బిజెపి మనువాద విధానాలను ఓడించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాల పేరు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి సుబ్బారావు కెవిపిఎస్ సీఐటీయూ వివిధ ప్రజా సంఘాల నాయకులు జి.రాములు బి పవన్ బి చెన్నయ్య జి మోహన్ లెనిన్ గువేరా పి వెంకన్న చెన్నయ్య రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు వేల్పూరు కామేశ్వర రావు భారత్ బచావో నాయకులు డా. ముత్తయ్య కేవీపీఎస్ నాయకులు లక్ష్మీ ,ఎల్లమ్మ సైదమ్మ చిట్టెమ్మ రేష్మీక స్వాతి తదితరులు పాల్గొన్నారు