డ్రగ్స్ కోరల నుండి యువజనన్ని కాపాడండి….!
Uncategorizedడ్రగ్స్ కోరల నుండి యువజనన్ని కాపాడండి….!
ప్రజా నేస్తం అవార్డు గ్రహీత
కామ్రేడ్ బోసన్న లేఖ
మాదక ముఠాల మూలాలు పెకలించాలి! ఎంఎల్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే ఎస్ ఆర్ రెడ్ సన్ నేతాజీ రాజన్న విజ్ఞప్తి
దేశభవితను కాపాడాలి…!!
కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే ఎస్ ఆర్ డిమాండ్
గంజాయి, కొకైన్, హెరాయిన్, మెథాంఫేటమిన్ వంటి మాదక ద్రవ్యాలు ఇప్పుడు ప్రతిచోటా పప్పుబెల్లాల్లా దొరుకుతున్నాయనీ.. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కమిటీ
జై బోరాన్నగారి సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులతో పాటు ఎందరినో మాదక మత్తులో ముంచేస్తూ ప్రజారోగ్యాన్ని అవి పీల్చిపిప్పిచేస్తున్నాయనీ. బాధితుల బంధువు ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.
పచ్చటి కుటుంబాలను కాటేస్తూ కన్నీటి కాష్టాలను రాజేస్తున్న మాదక రక్కసి- సామాజిక అశాంతి, అభద్రతలకూ ఆజ్యంపోస్తోందనీ జెఎస్ఆర్ తెలిపారు.
నేరాల ఊబిలోకి యువతను నెట్టేస్తూ- భావిభారత ఆశాదీపాలను అది కొండెక్కిస్తోందనీ జె ఎస్ ఆర్ పేర్కొన్నారు, ఈ దారుణాలను నివారించేందుకుగాను గంజాయి, ఇతర మత్తుమందుల దందాలపై ఉక్కుపాదం మోపి తీరాలని జనహితం కోసం పాటుపడే సామాజిక ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
మాదక ద్రవ్యాల కబంధహస్తాల్లోంచి నవతరాన్ని కాపాడుకోవాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో ప్రతిక్షణం ప్రజాహితమే ధ్యేయంగా… సమసమాజ స్థాపన లక్ష్యంగా…. తన వంతుగా నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణానికై పోరాడుతున్న కమ్యూనిస్టు, విప్లవ నాయకుడు కామ్రేడ్ జె ఎస్ ఆర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి నుంచి వెల్లువెత్తుతున్న గంజాయి ఇప్పుడు యావద్దేశాన్నీ ముంచెత్తుతోందనీ జనం మనిషి
జే ఎస్ ఆర్ తెలిపారు.
రాజమహేంద్రవరం నుంచి యూపీకి 360 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా ఒకటి ఈమధ్యనే హైదరాబాద్ శివార్లలో పట్టుబడిందనీ, ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో విరగపండుతున్న విష పంట ఆపై ఎన్నెన్నో రూపాలు మార్చుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాలకు పోటెత్తుతోందనీ సామాజిక కార్యకర్త… కార్మిక , కర్షక శ్రామిక వర్గ
బోర పుత్రుడు కామ్రేడ్ జైబోరన్నగారి సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ ఆరోపించారు.
మాదక మహమ్మారిని మూలాల్లోనే చావుదెబ్బ తీయాల్సిన ఖాకీలేమో కంటితుడుపు సరకు స్వాధీనాలతో సరిపుచ్చుతున్నారనీ జే ఎస్ ఆర్ బాధపడుతున్నారు.
శాంతిభద్రతల సంరక్షణా కర్తవ్యాన్ని గాలికొదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అని- గంజాయి గ్యాంగుల అభయారణ్యంగా భారతదేశం పరువుమాస్తోందనీ అనుక్షణం అభ్యుదయ సమాజం కోసం, అసమానతలు లేని నవభారత నిర్మాణం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు.
‘ డ్రగ్స్ వ్యవహారాలు విశాఖపట్నం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడ్డూ ఆపూ లేకుండా గంజాయి సాగవుతోందనీ నేతాజీ రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
విశాఖ మన్యం నుంచి ఏటా సుమారు పదివేల కోట్ల రూపాయల విలువైన గంజాయి ఇతర ప్రాంతాలకు నిక్షేపంగా సరఫరా అవుతోందనీ జనహితమే తనహితమై బ్రతుకంతా బడుగు వర్గాల చైతన్యం కోసమే ధరపోస్తున్న శ్రామిక వర్గ పోరాటయోధుడు కామ్రేడ్
జే ఎస్ ఆర్. ఆరోపించారు
‘దేశాన్ని సంపూర్ణ మాదకద్రవ్య రహిత ప్రాంతంగా మార్చేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జెఎస్ఆర్ కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లోనే గంజాయి ఘోరాలను అరికట్టడమూ ముఖ్యమంత్రికి చేతకాలేదనీ ప్రజాహితమే శ్వాసగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ధ్యాసగా బ్రతుకంతా బాధితుల కోసమే బతుకుతున్న ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్
జే ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో గంజాయికి బానిసైన ఒకడు ఓ అంధబాలికను నరికి చంపాడు. అదే నెలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గంజాయి మత్తులో మరో ప్రబుద్ధుడు ఓ పసిపాప గొంతు కోశాడు. రాష్ట్రం నలుమూలలా వినాశనం సృష్టిస్తున్న గంజాయి ఆఖరికి తిరుమల పవిత్రతనూ కదలబారుస్తోందనీ.. ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్
జే ఎస్ ఆర్ పేర్కొన్నారు. ఆ దివ్యధామానికి గంజాయిని తీసుకెళ్తున్న ఉదంతాలు ఇటీవల నెల వ్యవధిలో రెండు సార్లు వెలుగుచూశాయనీ. పాలకవర్గ రాజకీయ నేతలు, వారి బంధువులు మాదక ద్రవ్యాల నెత్తుటికూటికి అర్రులు చాస్తున్నట్లు కథనాలు వస్తున్న అధికార పార్టీ నిమ్మకు నేరెత్తిన రైతులు వ్యవహరించడం సరైనది కాదని సామాజిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.
గంజాయి అక్రమ రవాణా వెనక పెద్ద తలకాయలను పట్టుకోరేమిటి అని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాతంత్ర ఉద్యమకారుడు సమసమాజ స్వప్నికుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ నిగ్గదీసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు …. గుడ్డి గుర్రం పళ్లు బంధువు ఆపి సంపూర్ణ డ్రగ్స్ రహిత దేశ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రెడ్సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ కేంద్రం డిమాండ్ చేశారు.
మన దేశ ప్రజల ప్రజాప్రయోజనాలను, యువతరం యొక్క భవిష్యత్తును పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యాన్ని ఇకనైనా విడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కామ్రేడ్
జే ఎస్ ఆర్ డిమాండ్ చేస్తున్నారు.
యువతను నిర్వీర్యం చేస్తూ భారతదేశ భవిష్యత్తును కసిగా కబళిస్తోన్న పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు సంఘటితంగా ఉద్యమించాలని …బాధితుల బంధువు… ప్రజా సేవకులు , ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్
ప్రజలకు ,ప్రజాస్వామిక వాదులకు, ప్రజా సంఘాల నాయకులకు , దేశం యొక్క అభ్యున్నతిని కోరుకొనే దేశభక్తులకు నేడు జెఎస్ఆర్ ప్రత్యేకంగా రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు..