నిజాయితీకి మారు పేరైన రూపమైన భారీ నీటిపారుదల , పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయడం తగదని కోదాడ జడ్పీటీసీ మందలపు కృష్ణాకుమారి శేషు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిరాధారమైన అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు . దేశ స్థాయి లో అత్యున్నత పదవులను సైతం ఒదు లుకొని ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్నరని అన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మనమీదే పడితుందనే విషయాన్ని బీజేపీ నాయకులు గ్రాహి0చాలని అన్నారు.మరోసారి ఉత్తంకుమార్ రెడ్డి పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని , గత 30 ఏళ్లుగా ఉత్తమ్ దపతులు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు…