ఎర్రవరం దూళ్లగుట్ట శ్రీ బాల ఉగ్రనరసింహ స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు.
శుక్రవారం కావడంతో స్వామి వారి దర్శనానికి ఎండను సైతం లెక్కచేయకుండా గంటల కొద్ది క్యూ లైన్ లో వేచి ఉంటున్న భక్తులు……..
ఎర్రవరం దూళ్లగుట్ట శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం, వేసవి సెలవులు కావడంతో భక్తులు కుటుంబ సభ్యులు అందరితో కలిసి స్వామివారిని దర్శించేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపులు, మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది చల్లటి తాగునీటిని అందిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు…..