అక్రమ పట్టాలను రద్దు చేసి – పేదలకు భూమి పంచాలి.గుడిసె కేంద్రాలను సందర్శించిన సిపిఎం రాష్ట్ర నాయకులు
Mancherialమంచిర్యాల జిల్లా : పార్టీ ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను నిన్న ఉదయం భూకబ్జా దారులు వందలాది మంది వచ్చి పెదలపై దాడి చేయడం దారుణం.ఈ గుడిసె కేంద్రాలను పైళ్ల ఆశయ్య, మిల్క్ వాసుదేవ రెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించి మాట్లాడుతూ…చెన్నూరు మండలం బావురావుపేట గ్రామ శివారులోని సర్వే నెం 08 లో గల ప్రభుత్వ అసైన్డ్ భూమిలో గత 2 సం, లుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసం వుంటున్నారు.ఈ గుడిసెలను నిన్న ఉదయం భూకబ్జా దారులు వందలాది మంది వచ్చి పెదలపై దాడి చేసి వారిని గాయపరిచారు.అంతే కాకుండా వారి గుడిసెలను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న వస్తువులను, బియ్యన్ని బయట పడేసి వెళ్లిపోయారు. గుడిసెలో నివాసం ఉంటున్న ఆదివాసీ, గిరిజన మహిళలను ఇష్టం వచ్చినట్లు దుర్భషాలాడారు.అడ్డు వచ్చిన వారిపై దాడులు చేయడం జరిగింది. ఈ దాడులను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.జిల్లా కలెక్టర్ గారు , చెన్నూరు ఎమ్మెల్యే గారు , పోలీస్ అధికారులు, మండల తహసీల్దార్ సంబందిత అధికారులు స్పందించి గుడిసె పేదలకు పట్టాలు ఇవ్వాలి, వారికి రక్షణ కల్పించాలి. అక్రమ పట్టాలు రద్దు చేయాలి. దాడి చేసిన వారిపై sc, st అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి.భూ కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలి.లేకుంటే భవిష్యత్ ఆందోళన పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, జి. ప్రకాష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, బోడెంకి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి, డుర్కే మోహన్ కేవిపిఎస్ జిల్లా కార్యదర్శి, అరిగేల మహేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, అభినవ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, రవి, చారి, కరీమా, ఉమా రాణి, సమ్మక్క, సరిత, కుమార్, రమాదేవి, సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.