ఏకిగ్రీవంగా ఎనికైనా మొహమ్మద్ అలీ
Uncategorizedఈరోజు ఎస్ఎఫ్ఏసి మరియు సుస్థిర వ్యవసాయ కేంద్రం సహకారంతో అమలవుతున్న భూసంపత్తి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ కొరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎన్నిక నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం పెదిరిపాడ్ గ్రామంలో రైతు వేదిక దగ్గర గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల ఏకాభిప్రాయంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా మొహమ్మద్ అలీ ని రైతులు ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏ ఈ ఓ శ్వేత, మరియు సుస్థిర వ్యవసాయ కేంద్రం జిల్లా సోషల్ మొబిలైజర్ వెంకటయ్య గార్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘంలో చేరటం వలన ప్రతి రైతుకు తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు తార్ఫాలింగ్స్ ప్రేయర్స్ వ్యవసాయ పనిముట్లు అందించబడతాయి
ఈ సంఘం ద్వారా వ్యాపారం చేసుకోవడానికి ట్రేడింగ్ లైసెన్స్ ఇన్పుట్ లైసెన్స్ ఉన్నాయి
భవిష్యత్తులో ప్రాసెసింగ్ యూనిట్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు
కష్టం హైరింగ్ సెంటర్ ను గోదాములను శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి రైతు 2000 ఒక వంద రూపాయల వాటాదనంతో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఎస్ ఎఫ్ ఏ సి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ సంఘానికి 15 లక్షల వరకు గ్రాంట్స్ ఇవ్వబడుతుంది. రైతులు కూడా 15 లక్షలను ద్వారా జమచేసి ప్రభుత్వానికి అకౌంట్లో చూపించాలి ఈ వచ్చినటువంటి డబ్బుతో 30 లక్షలతో వ్యాపారం చేసుకుని వచ్చిన లాభాన్ని రైతులందరికీ సమానంగా ఇవ్వబడుతుంది ఇలా నారాయణపేట జిల్లాలో నాబార్డు ద్వారా మూడు సంఘాలు ఎస్ ఎఫ్ సి ద్వారా మూడు సంఘాలు నడుస్తున్నాయి వీటికి సుస్థిర వ్యవసాయ కేంద్రం అనే సంస్థ టెక్నికల్ సపోర్ట్ అందిస్తుందని అన్నారు.