జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో అవినీతి తిమింగలం డిఇ హుస్సేన్ నాయక్ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు.33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డిడి కట్టిన రైతు కుంభం ఎల్లయ్య.డిడి కట్టి రెండు నెలలు అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదు.డిఇ హుస్సేన్ నాయక్ ఆ రైతును 20,000 లంచం అడిగడంతో ఆ రైతు ఎసిబిని ఆశ్రయించాడు.దాంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు ఆ అవినీతి తిమింగలాన్ని 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.