-అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ఈ69న్యూస్ అయినవోలు భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఫీ మాట్లాడుతూ..రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని కనుక మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పలు సూచనలు చేశాడు.శిధిలావస్థలో ఉన్న ఇల్లు స్తంభాలు గోడల వద్ద ఉండవద్దని విద్యుత్ స్తంభాలు ఇంట్లో స్విచ్ బోర్డులతో జాగ్రత్తగా ఉండాలని వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద చెరువులు ప్రవాహాల వద్ద జాగ్రత్తగా ఉండాలని అలాగే రోడ్లపై నీరు ఉంటే జాగ్రత్తగా ద్విచక్ర వాహనదారులు నడపాలని సూచించాడు.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరాడు.