భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎస్ఐ రాజేష్
బూర్గంపాడు ఎస్ఐ రాజేష్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ
మండల పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొనవలెను అని కొన్ని సూచనలు చేశారు. పాత బడ్డ ఇండ్లలో ఎవరైనా నివసిస్తున్న చో వారు కొద్ది రోజులు మీకు తెలిసిన వారి ఇంట్లో నివాసం ఉండగలరు కరెంటు స్తంభాల దగ్గరకు కరెంటు పనిముట్ల దగ్గరకు పోరాదు ఎక్కడైనా చెట్లు విరిగిపడిన మరియు స్తంభాలు విరిగిపడిన కరెంటు వైర్లు తెగిపడిన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు గ్రామ అధికారులకు పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు. మండలంలో కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు ఈ అధిక వర్షాల వల్ల వాగులు వంకలు వరదలుతో ప్రవహిస్తూ ఉంటాయి వాటిని దాటి ప్రయత్నం చేయకండి రోడ్డుపై వాహనాలలో వెళ్లేటప్పుడు చిన్నగా జాగ్రత్తగా వెళ్లగలరు. అనవసరంగా ఇంటి నుండి బయటికి రావద్దు వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కిందికి కరెంటు స్తంభాల కిందకి వెళ్ళరాదు పైన ఉన్న సూచనలను పాటించాలని బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ తెలియజేశారు…