బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉన్న వేపల గడ్డ కొమ్ము నగరిపేట మధ్యలో తూము వాగు కల్వర్టు గత రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు కొట్టుకపోవటం జరిగింది. అలాగే బూర్గంపహాడ్ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు దగ్గరలో సీతారామ ప్రాజెక్టు కాలువ కూడా ఈ భారీ వర్షాలకు దెబ్బతిన్నట్లు సమాచారం ఈ విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ తహసిల్దార్ తన సిబ్బందితో కల్వర్టు దగ్గర చేరుకొని విషయాన్ని పరిశీలించి కలెక్టర్ కి నివేదిక ఇవ్వడం జరిగిందని తాసిల్దార్ పేర్కొన్నారు.