అకాల వర్షాలు విష జ్వరాల బారి నుండి ప్రజలను కాపాడాలి.
Uncategorizedగ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
కొత్తగూడెం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు వలన నష్టపోయిన ప్రజలను విష జ్వరాలతో బాధపడుతున్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాల కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య కోరారు
స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన చాలా ప్రాంతాలు నీట మునిగిపోయి లోతట్టు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి ఇల్లు కోల్పోయిన ప్రజలకు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే ఈ భారీ వర్షాల వలన రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని వేసిన పంట నేలపాలైపోయిందని ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని దీని వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు వాగులు బ్రిడ్జిలు నాశనం అయిపోయాయని వర్షాలు తగ్గిన తర్వాత వాటిని మరమత్తు చేయించాలని ఆయన కోరారు. అలాగే మరోవైపు జిల్లాలో విష జ్వరాలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని చికెన్ గున్యా డెంగ్యూ లాంటి జ్వరాలు బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలల్లో వీటికి సంబంధించిన వైద్య సదుపాయం సక్రమంగా అందడం లేదని ప్రభుత్వం స్పందించి ప్రాథమిక వైద్య కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ల్యాబ్ సౌకర్యాలు కల్పించి ప్రధానంగా వస్తున్నటువంటి చికెన్ గున్యా డెంగ్యూ లాంటి జ్వరాలు నుంచి ప్రజలను కాపాడడానికి అవసరమైన వైద్య సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు ప్రస్తుత వర్షాభావం రీత్యా మండల కేంద్రాలకు వచ్చి వైద్య సదుపాయం అందుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వైద్య సదుపాయం అందుబాటులో లేని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. జిల్లా కేంద్ర హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులు లేదా ఖమ్మం వరంగల్ లాంటి సుధీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ విషజ్వరాలు నుండి ప్రజలను కాపాడాలంటే వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అందుకు జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిని అభివృద్ధి చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేకించి ప్లేట్లెట్ మిషిన్ ల్యాబ్ సౌకర్యాలు డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు.
ఆపదలో ఉన్న ప్రజలకు పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ చురుకుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ఏజే రమేష్ కె బ్రహ్మచారి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.