కూనవరం మండలం పెద్ద ఆర్కూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గండి కొత్తగూడెం గ్రామం వెళ్లే రోడ్డు మధ్యలో వాగుకి కట్టిన బ్రిడ్జి గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి మరమత్తులకు గురి అయినదని మరియు రేపాక నుండి గండి కొత్తగూడెం వెళ్లే రోడ్డు కంకర రాళ్లు తేలి కనీసం మోటర్ సైకిల్ కూడా వెళ్లే పరిస్థితి లేదని అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని రోడ్డు బ్రిడ్జిని సమస్యలను ఈరోజు చింతూరు లో సిపిఎం ప్రజాప్రతినిధులు బృందం పీ ఓ దృష్టికి తీసుకువెళ్లగా పిఓ వెంటనే స్పందించి మరమ్మతులకు గురి అయిన బ్రిడ్జిని,రోడ్డును స్వయంగా కొంత దూరం వెళ్లిన తర్వాత పిఓ వెహికల్ వెళ్లక పోతే కిలోమీటర్ వరకు కాలినడకన వచ్చి బ్రిడ్జిని సందర్శించడం జరిగినది తక్షణమే మరమ్మత్తులు చేయించుటకు నేను కృషి చేస్తానని పిఓ ప్రజా ప్రతినిదుల బృందానికి హామీ ఇచ్చినారు, ఈ కార్యక్రమంలో పెద్ద ఆర్కూర్ సర్పంచ్ నాగమణి ,కూనవరం మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, మండల సిపిఎం నాయకులు మేకల నాగేశ్వరావు ,ఎంపీటీసీ అమ్మాజీ, చూచిరేవుల గూడెం ఎంపీటీసీ కారం జయసుధ ,లింగాపురం సర్పంచ్ సోడి శంకర్, రేగులపాడు సర్పంచ్ బొగ్గ రామారావు, కూటూరు సర్పంచ్ బొగ్గ ఎంకమ్మ, తదితరులు పాల్గొన్నారు.