నేడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా
Bhadradri Kothagudemభవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను టెండర్ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిల్డింగ్ & అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు ఆద్వర్యంలో నేడు (3-9-2024 )న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ను జయప్రదం చేయాలని
యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాచారి విజ్ఞప్తిచేశారు.
కొత్తగూడెంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో బ్రహ్మాచారి మాట్లాడారు.
వెల్ఫేర్ బోర్డు సిఐటియు ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి పోరాడితే 2007 సంవత్సరంలో చట్టం చేసి 2009 నుంచి అమలు చేస్తున్నారు భవన నిర్మాణ కార్మిక లకు సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులు పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆరు లక్షల 30,000 సాధారణ మరణానికి ఒక లక్ష 30,000 పెండ్లి ,ప్రసూతి కానుకలు 30,000 ఇలాంటి పథకాలు కొన్ని అమలైతున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నిధులు పెంచే ప్రయత్నం గానీ బోర్డుకు అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం గానీ చేయలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనంటూ సంక్షేమ బోర్డు నిధులను టెండర్ల పేర్లతో ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్ప చెబితే చిన్న చిన్న కారణాలు చెప్పి పథకాన్ని నీరు గారిచే పరిస్థితి ఏర్పడుతుందని అందుకని వెళ్ళిపోయారు బోర్డును ప్రభుత్వమే నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న జిల్లా కవిుటి సభ్యులు భూక్యా రమేష్,పట్టణ నాయకులు బాలరాజు , బాలకృష్ణ, రఘు, తదితరులు పాల్గొన్నారు.