భద్రాచలం: వారం రోజుల గా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం పట్టణంలోని పలు ప్రదేశాలలో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయింది కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలు, సరైన కాలువ వ్యవస్థ లేక వర్షాధారం కాగానే రోడ్డుపైకి నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది పట్టణ ప్రధాన రహదారి చర్ల వెళ్ళే మార్గంలో ఏపీ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ముందు వర్షపు నీరు నిలిచిపోయింది ఇక్కడే కాక పట్టణంలో పలు ప్రదేశాలలో వర్షపు నీరు ఆగి పారిశుద్ధ సమస్యకు దారి తీసే ప్రమాదం ఉంది. కావున అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.