హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల కార్యదర్శి సిపతి వినయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ చరిత్రను,అది చేసే ఉద్యమాలను విద్యార్థులకు వివరించారు.అనంతరం మండల కార్యదర్శి సిపతి వినయ్ మాట్లాడుతూ..ఏఐఎస్ఎఫ్ నిత్యం విద్యార్థి సమస్యలపై పోరాడుతూ,వారికి మౌలిక వసతులు కల్పించేలా ఉద్యమాలు,పోరాటాలు చేస్తుందని,విద్యార్థుల యొక్క సమస్యలైనా స్కాలర్షిప్,ఫీజు రీఎంబర్స్మెంట్,హాస్టల్ వసతులు,కాస్మోటిక్ చార్జీల పెంపు పై ప్రభుత్వాలపై నిరంతరం పోరాటాలు సాగిస్తుందన్నారు.పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో దోమలు ఈగలు విజృంభిస్తున్నాయని వాటి వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఆవరణలో పిచ్చి మొక్కలను వీలైనంత త్వరగా తీసి వేయాలన్నారు.మధ్యాహ్న భోజన సమయంలో త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయుడిని కోరాడు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భైరి వంశి,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.