ఆదివాసీ చట్టాలు అమలు లో ప్రభుత్వ లు నిర్లక్ష్యం.
Bhadradri Kothagudemఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏ ఎస్ పి మరియు దాని అనుబంధ సంఘాలు (ఏ వి ఎస్ పి, ఆట, ఏ ఎం హెచ్ ఈ) ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం సరియం నాగేశ్వరావ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న ఏ ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు, ఆట రాష్ట్ర అధ్యక్షులు జలగం రాంబాబు మాట్లాడు తూ ప్రభుత్వ లు ఆదివాసీ చట్టాలు అమలు లో నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని దీని మూలాన ఆదివాసీలు హక్కులు పొందలేక పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాను రాను ఆదివాసీ చట్టాలకు మనుగడ లేకుండా పోతుందని, ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దు తో ఆదివాసీ లకు తీవ్ర అన్యాయం జరిగింది. అదికాక ఇటీవల సుప్రీం కోర్టు కూడా SC ST వర్గీకరణ పై ఇచ్చిన తీర్పు వలన ఆదివాసీ లకు రాబోయే కాలంలో తీవ్రంగా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని అన్నారు. 1/70 చట్టం అమలుకు నోచుకోక ఏజెన్సీ లో గిరిజనయేతురుల హావ కొన సాగుతుంది. 5వ షెడ్యూల్డ్ ప్రాంతం మొత్తం గిరిజనయేరుల కబ్జా లో పోతుంటే ఏజెన్సీ ప్రాంతంలో ని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిన ఐ టి డి ఎ పేరుకే ఉన్నాయి. ఆదివాసీ చట్టాలు కాపాడటానికి ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇవన్నీ జారుతున్న ఆదివాసీలు ఉద్యమ బాట పెట్టకుంటే చట్టాలు అమలు అయ్యే పరిస్థితి లేదు హక్కులు దక్కే పరిస్థితి లేదు అని అన్నారు. చదువు కున్న ఆదివాసీ యువత మరియు ఆదివాసీ ఉద్యోగులు ఆదివాసీ సంక్షేమ పరిషత్ తో కలిసి ఆదివాసీ లకు చట్టాలు హక్కులు పై అవగాహనా కల్పించే ఉద్యమం లో పాలు పంచుకోవాలి అని కోరారు. లేదంటే ఆదివాసీ భవిష్యత్ ప్రశ్నర్ధకం గా మారుతుంది అని హెచ్చరించారు. నూతన ప్రభుత్వం ఎలక్షన్ సమయం లో ఆదివాసీ లకు ఇచ్చిన హామీలు నెరవేర్చలని ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమం లో ఆట గౌరవ అధ్యక్షులు తెల్లం రాములు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, ఆట రాష్ట్ర కోశాధికారి వంజం దర్మరాజు, తెల్లం లక్ష్మణ్ రావు , కూరం సంజీవ్ రావు తదితరులు పాల్గొన్నారు