రఘునాథపల్లి / తెలుగు గళం న్యూస్ :రఘునాథపల్లి మండల కేంద్రంలో విజయ డైరీ పాల ఉత్తత్తి దారుల సంఘం మండల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షునిగా ఖిలాషాపురం గ్రామానికి చెందిన గడ్డం అంజయ్యగౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అంజయ్యగౌడ్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నాకు మండల అధ్యక్షులుగా పదవి అప్పగించడంతో తన పై భాధ్యత పెరిగిందని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో విజయ డైరీని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృష్టి చేస్తానని అన్నారు. ఈ ఎన్నికకు సహరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.