వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలి
Jangaon
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు
రఘునాథ్ పల్లి: తెలుగు గళం న్యూస్/
వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు అన్నారు
మంగళవారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ అధ్యక్షత వహించగా 39 వ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం నాగరాజు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి తిరుగుబాటు ఐలమ్మ చేశారన్నారు బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతా అని వెట్టి చేసే రోజులలో దేశ్ముఖ్ అనుచరులను తరిమికొట్టిన తెలంగాణ పోరు బిడ్డ ఐలమ్మ అని అన్నారు ఓరుగంటి మల్లమ్మ సాయిలు అనే పుణ్య దంపతులకు 1895లో జన్మించింది వీరు వారి వృత్తి చేసుకుని బతికేవారు వీరికి ఆరుగురు కుమార్తెలు నలుగురు నలుగురు కుమారులు ఉన్నారు నాలుగో సంతానంగా ఐలమ్మ పుట్టారు 1944 దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నల్ల నరసింహులు దొడ్డి మల్లయ్య మచ్చ రామయ్య మాచర్ల కొమురయ్య రావి నారాయణరెడ్డి వారి ప్రోత్సాహంతో ఆంధ్ర మహాసభ ప్రారంభించి తమ కార్యక్రమాలు ప్రారంభించారు మహాసభ ఆర్గనైజేషన్ కోసం కడవెండి దేవరుప్పుల పాలకుర్తి కేంద్రాలను స్థావరాలుగా చేసుకొని వాటి చుట్టూ ఉన్న పరిసర గ్రామాలలో పార్టీ కార్యక్రమాల కోసం రావి నారాయణరెడ్డి కట్కూరి రామచంద్ర రెడ్డి చకిలం యాదగిరి రావు లను నియమించి కార్యక్రమాలు పోరాటాలు సాగించారు 60 గ్రామాల దేశ్ముఖ రామచంద్రారెడ్డి కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉత్తర దిశలో పాలకుర్తి ఉంది కడవెండి పాలకుర్తి గ్రామాల మధ్య ఉన్న విసునూరును కేంద్రంగా చేసుకొని దేశ్ముఖ్ పరిపాలన కొనసాగించేవాడు ఇతనికి బాబు దొర (జగన్మోహన్ రెడ్డి ) అనే 18 ఏళ్ల కొడుకు ఉన్నాడు ఆనాడు తెలంగాణ ప్రాంతాన్ని నిజం నవాబు పరిపాలిస్తున్నాడు ఇతడు విసునూరు రామచంద్రారెడ్డిని ఉపసేనాధిపతిగా నియమించాడు దేశ్ముఖ కొడుకు బాబు రజాకారులతో కలిసి గ్రామంలో దేశ్ముఖ తల్లి జానకమ్మ కొడుకుకు సహకారం అందించేది వెట్టి చాకిరి బానిసత్వం తో ప్రజలు మగ్గిపోతున్న సమయంలో 1944 కడవెండి గ్రామంలో నల్ల నర్సింలు తో పాటు మరికొంతమంది ఆంధ్ర మహాసభను ప్రారంభించి వెట్టిచాకిరిని వ్యతిరేకిస్తూ భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం అని పోరాటం ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కడారి ఐలయ్య చెరుకు రాజు కడారి యాదగిరి చెరుకు శ్రీనివాస్ నరేందర్ వెంకటయ్య రాములు నరసింహులు తదితరులు పాల్గొన్నారు