రఘునాథపల్లి : తెలుగు గళం న్యూస్ /వరంగల్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. హన్మకొండ JNS స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి అండర్ 14 విభాగంలో ప్రతిభ చూపించి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జెడ్ పి హెచ్ ఎస్ అశ్వారావుపల్లి విద్యార్థులు ప్యారాల కావ్యగ్రో, ముప్పడి భవాని, కొలిపాక అన్వేష్ ఎంపికైనారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు p. శోభన్ బాబు అభినందించారు. ఎంపికైన క్రీడాకారులు సికింద్రాబాదులో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోట్లూ పాల్గొంటారని తెలిపారు.విద్యార్థులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్, PET రాజేందర్ ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి, యాకయ్య, పవనకుమార్, సీతారామ్, అనిత, రేవతి, భద్రయ్య, మనోజి విద్యార్థులను అభినందించారు.