పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష పార్టీల శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్న నీచ చరిత్ర బీఆర్ఎస్ దని మండిపడ్డారు.హైకోర్టు తీర్పుతో ఏదో అయిపోయిందని,అప్పుడే ఉపఎన్నిక వచ్చిందన్నట్లుగా సంబరాలు చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని,వారి అజ్ఞానం పట్ల జాలి పడుతున్నానని అన్నారు.గతంలో కాంగ్రెస్,టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని,హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీలు ఇంకా తమకు అందలేదని తెలిపారు.కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని,వారి సలహాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.హైకోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు.విమర్శించే వారి నోరు మూపించే విధంగా,ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.