చెవిటి, మూగ, వికలాంగుల చిన్నారులను సందర్శించిన పిఓ సతీమణి
తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఒకరినొకరు ఆనందాన్ని పంచుకుంటూ వికాసం పాఠశాలలో చదువుకోవడం చాలా సంతోషకరమని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సతీమణి శ్రీమతి మనీషా సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి ఐటీడీఏ కార్యాలయంలోని నివాస గృహాలలో మహాగణపతి నవరాత్రి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సంతర్పణ (అన్నదానం) కార్యక్రమంలో దంపతులు ఇద్దరూ పాల్గొని భక్తులకు ప్రసాదం అందించిన అనంతరం ఆరోజు రాత్రి భద్రాచలంలోని వికాసం పాఠశాలలో చదువుతున్న చెవిటి మూగ వికలాంగుల చిన్నారుల వికాసం పాఠశాలను సందర్శించి వారికి సంతర్పణ అన్న ప్రసాదాలు అందించి పిల్లలతో సరదాగా గడిపారు. పాఠశాలలో చిన్నారులకు హియరింగ్ ఎయిడ్ ఉపాధ్యాయ నిలు బోధించే విధానాన్ని మరియు స్పీచ్ ట్రైనర్ ద్వారా విద్యార్థుల మాటలు ఇచ్చే విధానాన్ని ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చెవిటి మూగ వికలాంగుల చిన్నారులు తమకు ఇది కావాలని అడగలేరని వారిని మీరే తల్లిదండ్రులుగా భావించి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రిన్సిపాల్ కు సూచించారు.
అనంతరం ఉపాధ్యాయుల సైగల ద్వారా చిన్నారుల నాట్యాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేస్తూ, నెలకు ఒకసారి తప్పనిసరిగా వికాసం పాఠశాలను సందర్శిస్తానని, పిల్లల యొక్క మంచి చెడ్డలు తెలుసుకొని వారితో ఉండడానికి సమయం కేటాయిస్తానని ఆమె ప్రిన్సిపాల్ కు, పిల్లలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వికాసం పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న కుమారి, ఉపాధ్యాయినీలు ప్రియాంక, అరుణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.