ఈరోజు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి మారు జోడు రాంబాబు ఆధ్వర్యంలో కిలాషాపురం గ్రామ రైతులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని కలిసి కిలాషాపురం గ్రామం నుండి జాఫర్ గూడెం వెళ్లే దారి ఈ మధ్యకాలంలో వర్షాలకు బాగా గుంతలు గుంతలుగా మారి అధ్వానంగా మారడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా వారు వెంటనే స్పందించి డిఈ కి ఫోన్ చేసి తాత్కాలిక మరమ్మత్తుల కోసం వెంబడే రెండు మూడు లక్షల తో పని మొదలుపెట్టాలని ఆదేశించడం జరిగింది.అలాగే శాశ్వత పరిష్కారం ఎక్స్ట్రీమేట్ వేయమని చెప్పడం జరిగింది.కడియం శ్రీహరి వెంటనే స్పందించడంతో గ్రామ రైతులు అభినందనలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గాదే రమేష్, మాజీ సర్పంచ్ అల్లిబిల్లి నరసయ్య, బక్క యాదగిరి, బక్క మల్లేష్,ఉమ్మగోని రాజు తదితరులు పాల్గొన్నారు.