ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శిగా వెంకట్ నాయక్ ఎన్నిక
Anantapur, Andhra Pradeshతెలుగు గళం రిపోర్టర్ మల్లికార్జున
కళ్యాణ్ దుర్గం పట్టణంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు నిర్వహణలో భాగంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి గా వెంకటనాయక్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాన్సన్ బాబు శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు నారాయణస్వామి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన ఏఐఎస్ఎఫ్ జిల్లాసహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పైన అనంతపురం జిల్లాలో సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసత గృహాల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తామని తెలిపారు కస్తూర్బాయ్ గురుకుల పాఠశాలలో జిల్లాలో అర్ధాంతరంగా నిర్మాణంలో ఆగిపోయినాయి వాటిని ప్రారంభించేంతవరకు జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు .ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాన్ని బలోపేతం కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికలకు సహకరించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితికి సిపిఐ జిల్లా పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు