ధర్మసాగర్ తెలుగు గళం సెప్టెంబర్-24 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కొట్టే శ్రీనివాస్ 40 సంవత్సరాలు ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతూ హఠాత్తుగా మరణించగా 1999-2000 బ్యాచ్ కి చెందిన అతని స్నేహితులు ఐన పదవ తరగతి పూర్వ విద్యార్థులు మృతిని భార్య ఇద్దరు కుమారులకు 61000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అంద చేశారు. శ్రీను కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1999-2000 పదవ తరగతి బ్యాచ్ కి చెందిన స్నేహితులు పాల్గొన్నారు.