ఐటిఐ అడ్మిషన్ లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు
Bhadradri Kothagudemబూర్గంపాడు: విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా ఆగస్టు 2024 శేషన్ కొరకు NCVT ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లలో శిక్షణ పొందడానికి రాష్ట్రంలోని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఐటిఐ లలో మొదటీ దఫా, రెండవ దఫా, మూడో దపా, నాలుగో దఫా లో మిగిలిన సీట్ల కొరకు 5 వ దప వాక్ ఇన్ అడ్మిషన్ల ఆన్లైన్ లో దరఖాస్తుల కోరుచున్నట్లు
ప్రభుత్వ ఐటిఐ కృష్ణ సాగర్ ప్రిన్సిపాల్ ధర్మాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
http://iti.telangana.gov.in వెబ్ సైట్ లో నిజ ధ్రువ పత్రాల ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు.
05 వ దప వాక్ ఇన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ కి దాఖలు తేదీ 23 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ ఉదయం 11 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రోజు వారి ఆన్లైన్ మెరిట్ ప్రాతిపదికన మాత్రమే సంబంధిత ఐటిఐ లో సీట్లు కేటాయించబడతాయని, తేదీ 25 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి ప్రారంభించబడునని, కావున ఐటిఐ లో సీటు పొందాలనుకునే వారు సంబంధిత ఐటిఐ లో నిర్ణీత సమయంలో మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఐటిఐ రిజిస్ట్రేషన్ ఫామ్, వర్జినల్ సర్టిఫికెట్స్ ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్, ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్, టిసి, ఫోటోగ్రాఫ్స్ రెండు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీ ఇతర సంబంధిత సర్టిఫికెట్స్ తో సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ లో హాజరు కావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 05 దపా వాక్ ఇన్ అడ్మిషన్ 2024 కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ఇంతకుముందు అప్లై చేసుకొని అభ్యర్థుల కొత్తగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి, అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ న్నమోదు చేసుకోవలసిన అవసరం లేదని, ఇదివరకే మొదటి దప, రెండవ దఫా మూడో దప, నాలుగవ దప లో సీటు పొందిన అభ్యర్థులకు ట్రేడ్ మార్చుకొనుటకు అవకాశం కలదని,ఆయన తెలుపుతూ ఇట్టి అవకాశమును అర్హులైన అభ్యర్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.