హనుమకొండ: బస్టాండు ప్రధాన రోడ్డుపై మూల మీద ఉన్న డ్రైనేజీ కాలువ ప్రమాదంగా మారిందని, అధికారులు స్పందించి దానిపై (మూతలు) కప్పు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.గురువారం హనుమకొండ బస్టాండ్ ప్రధాన రహదారి అనుకొని ఉన్న డ్రైనేజ్ కాలువను డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పరిశీలించారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు.. రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువ ప్రమాదకరంగా ఉందని వాహనదారులు, మనుషులకు తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ప్రభుత్వము అధికారులు స్పందించి దానిపై కప్పు ఏర్పాటు చేయాలని, వర్షాకాలం వస్తే కాలువ నిండుకొని డ్రైనేజీ నీళ్లు రోడ్ల మీదకి చేరుతున్నాయి, కాల్వకు మూత లేకపోవడంతో వాహనదారులు, మనుషులు అందులో పడే ప్రమాదం ఉందని, కాలువలో, చెత్త వ్యర్థం తో దుర్వాసన, దోమలు తో చుట్టుపక్కల ఉండే వాళ్లకు రోగాలు వస్తున్నాయని, ప్రధాన రహదారిపై ప్రమాదంగా మారిన దాన్ని అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే స్పందిస్తారని తిరుపతి ప్రశ్నించారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను లేకుండా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఓర్సు చిరంజీవి, వల్లెపు లక్ష్మణ్, నాయకులు మాటూరి సతీష్, రాజు, శ్రీకాంత్, అనిల్ పాల్గొన్నారు.